పరిస్థితులు ఎలా ఆవిర్బవిస్తాయి!

                                        Image result for time
ప్రతి పరిస్థితి తన సందేశాన్నిఇస్తుంది ప్రతి మనిషి యొక్క జీవితంలో. చిత్రంగా, కొంత మంది వ్యక్తులు ఆ సందేశాన్ని గుర్తించగలరు. ప్రస్తుత జీవనంలో చాలా మంది ఆందోళనల కారణంగా పరిస్థితులు ఇచ్చే సందేశాన్ని గుర్తించలేకపొతున్నారు.
మనిషి తనకు ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్తితి ఏర్పడింది అని బాధపడుతుంటాడు. కానీ అవి అలా ఎందుకు ఆవిర్బవిస్తున్నాయో అని చూసే ధృకోణాన్ని మార్చాలి ఇలా.
  1. సమస్యలు లేదా పరిష్కారాలు పరిస్థితుల నుండి వస్తున్నాయన్నది గుర్తించాలి.
  2. పరిస్థితులు ఆలోచనల నుండి ఆవిర్బవిస్తాయి.
  3. ఆలోచనలు మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకొనే వాటి నుండి ఆవిర్బవిస్తాయి
మంచి ఆలోచనలు గల వ్యక్తి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చగలడు అలాగే ఆలోచింపచేయగలడు.
జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం తీసుకునే వాటిపై జాగ్రత్త వహించాలి. అవే ఆలోచనలకు కారణం. ఆ ఆలోచనలే పరిస్థుతుల ఆవిర్బవనికి కారణం.

Post a Comment

0 Comments