జ్ఞాపకాలు
అనేవి చాల గొప్పవి. మనిషికి శక్తినివ్వడంలో వీటి పాత్ర ఎంతో ఉందని నేను
విశ్వసిస్తున్నాను. విచిత్రం ఏమిటంటే!
- చిన్నతనంలో జరిగిన సంఘటనలు
గుర్తుతెచ్చుకున్నపుడు అవి సంతోషాన్ని కలిగిస్తాయి.
- మంచి జ్ఞాపకాలు ప్రస్తుత స్థితిని గొప్పగా
మార్చగలవు.
- అదేవిధంగా చెడ్డ జ్ఞాపకాలు ప్రసుత
క్షణాన్ని ఆవిరిచేయగలవు.
ప్రసుత
స్థితిని జ్ఞాపకాలు ఎలా మార్చగాలవంటే...
ఉగాది పచ్చడి
సామాగ్రి కోసం బడి సెలవు ముందు రోజు బడి ఎగ్గొట్టి స్నేహితులతో కలసి ఏదో గొప్ప
కార్యం నెరవేర్చబోతున్నాం అన్నట్లు చెట్లు ఎక్కడం, హడావుడి చేయడం వంటివి అనుకోవచ్చు.
హా..
గుర్తుకోస్తున్నాయ్ ఆ జ్ఞాపకాలు ,
మనస్సు ఈ క్షణాన్ని ఆ జ్ఞాపకాలతో
పులకరింపచేసింది.
ఓ మహా కవి
అన్నాడు..
సంతోషం ఎక్కడ
లేదు అది నీ మనస్సులోనే ఉంది,
అది నీ జ్ఞాపకాలలోనే ఉంది అని.
0 Comments