మనిషికి రాక్షసత్వం అవసరమా?
ప్రతి మనిషిలోను రాక్షసత్వం ఉంటుంది. కానీ అది పెరిగిన వాతావరణం బట్టి, పరిస్తితుల బట్టి మనిషి వ్యక్తిత్వం ద్వారా అది బయటపడుతుంది. నేటి ప్రపంచంలో మనిషి రాక్షసత్వం ప్రదర్శించాలా లేదా అనేది భౌగోళిక జీవన పరిస్తితుల మీద ఆధారపడి ఉంటుంది.
ఎక్కడైతే కల్మషం లేని వ్యక్తుల జీవనం ఉంటుందో అక్కడ మనిషి రాక్షసత్వం అనేది అవసరం ఉండదు. ఉదాహరణకు పల్లెవాతవరణం, అడవి జీవనంలో రాక్షసత్వం అనేది తక్కువ శాతంలో ఉంటుంది. కానీ అదే జీవనంలో అర్బన్ ఏరియా లో హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఏరియా లో రాక్షసత్వం అనేది లేకపోతే ఆ మనిషి నీచ స్థాయిలోకి వెళ్ళిపోతాడు లేదా అక్కడి ప్రజలు అణగాద్రోక్కుతారు. మనం మంచిగా ఉన్నాం కదా అని ప్రతివారు మనతో మంచిగా ఉంటారు అనుకోవడం తప్పు. మనపై రాళ్ల లాంటి మాటలు విసిరేవారిపై రాక్షసత్వం ప్రదర్శించడం తప్పుకాదు. అలా చేయకపోతే గుండెల్లో తిష్ట వేసిన కోపం శోకం గా మారి మనిషని తన చేతులతో తానే కొరివి పెట్టుకున్నవాడుగా చేస్తుంది.
కొందరు భావిస్తుంటారు ఇలా – “నేను అందరితోను మర్యాదగా ప్రవర్తిస్తున్నాను కానీ కొందరు ఎందుకు నా పట్ల అమర్యాదగా ఉంటున్నారు అని”. పొరపాటు భావించాడంలోనే ఉంది. మంచి వాళ్ళకు మంచిగానే ఉండి రాక్షససులకు రాక్షసత్వంతోనే బదులివ్వలిమరి!.
0 Comments