నేను గోదావరి
నది ఒడ్డున కూర్చొని ఉన్నపుడు నా మది ప్రశ్నల మరియు పరిష్కారాల ఆలోచనలు సాగించింది
ఇలా .....
జీవితం అంటే
సాహసమా! అయితే దైర్యం చేయాలి
జీవితం అంటే
ప్రేమ! అయితే ఆస్వాదించాలి
జీవితం అంటే
దు:ఖంమా! అయితే ఎదుర్కోవాలి.
జీవితం అంటే
యుద్దమా! అయితే పోరాడాలి.
జీవితం అంటే
వాగ్దనమా ! అయితే నిలబెట్టుకోవాలి.
జీవితం అంటే
సవాలా! అయితే దీటుగా జవాబివ్వాలి
జీవితం అంటే
భాద్యతా! అయితే నెరవేర్చాలి
జీవితం అంటే
భాదలా! అయితే అధిగమించాలి
జీవితం అంటే
ఆట! అయితే ఆడుకోవాలి
జీవితం అంటే
సమస్య..... ఐతే పరిష్కరిస్తాను,
సాధిస్తాను, గెలుస్తాను...
అరెరే గోదారమ్మ
గాలి తగిలి మదిలోని సంఘర్షణలు సమసిపోయయే.....
0 Comments