అమూల్యం.. ఈ క్షణం...

                   Time, Alarm Clock, Clock, Watch, Hour

Ø  నిన్న అనేది గతం, రేపు అనేది ఓ రహస్యం, కానీ నేడు అనేది ఓ వరం,అందుకే ఓ బహుమానం లాంటిది ఈ వర్తమానం, దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి.
Ø  మనం దిగాలుగా ఉంటే, గతంలో మునిగి పోయినట్లు,  మనం ఆతురత పడుతుంటే భవిష్యత్తులో విహరిస్తున్నట్లు, మనం శాంతంగా ఉంటేనే వర్తమానంలో జీవిస్తున్నట్లు!
Ø  చింతించడం వల్ల నిన్నటి బాధ తిరిపోదు, దిగులు పడటం వల్ల రేపటి దుఖం దూరం కాదు, నేటి సుఖమే నాశనం అవుతుంది.
Ø  ఎంత విచారించినా గతాన్ని మార్చలేం, ఎంత చింతించిన భవిష్యత్తుని ఆపలేం ఇక చేయాల్సినదల్ల వర్తమానంలో జీవించడమే!
Ø  బుద్ద భగవానుడు చెప్పినట్లు, మనశ్శరిరాల ఆరోగ్యానికి రహస్యం, గతాన్ని తలచి వ్యధ చెందడం కాదు భవిష్యత్తుని చిత్రికరించుకొని భాధ పడటం కాదు, వర్తమానంలో వివేకంతోనూ, శ్రద్దతోను జీవించడమే!
Ø  మన భవిష్యత్తు.. రేపు చేయబోయే దానిపై కాదు, నేడు చేసే దానిపైనే నిర్మించబడుతుంది. ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది.. రేపటి నుండి కాదు, నేటి నుండే.. కాదు.. కాదు.. ఈ క్షణం నుండే!

Post a Comment

0 Comments