గేమ్స్ ఆడి పేదలకు అన్నం పెట్టవచ్చా!


                                              Image result for freerice.com
ఈ మాయదారి మనస్సు ఖాళీగా  ఉంటే కుదురుగా  కూర్చోదు. ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది. అలా ఈ మధ్యనే  ఒక వెబ్ సైట్ చుసాను. అదే freerice.com. ఈ వెబ్ సైట్  లో గేమ్ ఆడితే 10 గ్రైన్స్ రైస్ వస్తుంది ప్రతి కరెక్ట్ సమాధానానికి. ఇందులో vocublary కూడా నేర్చుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ని చూడగానే ఆనందం కలిగింది. ఊరుకుల పరుగుల  జీవితం, ఏదైనా వండి పేదలకు పెడదమంటే సమయం సరిపోదు. కానీ ఈ వెబ్ సైట్  ద్వారా నేను కనీసం ఒక్కరికైన అన్నం పెట్టగలుగుతున్నని ఒక తృప్తి ఉంది. నిజంగా ఇవ్వడంలో ఉన్న అనందం మరెందులోనూ ఉండదు దానం చేసినపుడు.
ఆ ప్రయత్నంలోనే  నా మైండ్  మరో వెబ్ సైట్ ని కూడా కనుగొంది. అది feedingindia.org. ఈ వెబ్ సైట్ లో signup అయ్యి volunteer గా జాయిన్ అవ్వవచ్చు. సమయం ఉన్నపుడు లేదా సమయం చేసుకొని ఈ సంస్థ ద్వారా volunteer గా వెళ్ళి పళ్ళెంలో అన్నం పెట్టి పేదలకు ఇస్తున్నపుడు వాళ్ళ కళ్ళలో ఉన్న వెలుగును చుసినపుడే నిజంగా జీవించినట్లు అవుతుందని అనిపిస్తుంది.
పూర్వం అతిథిదేవోభవ: అని ఉండేది. అంటే అతిధులు భోజనం చేయనిదే మనం భోజనం చేయకూడదని నియమం. ఇక్కడ అతిధులంటే మనుషులే కనర్కలేదు. ఈ భూమి మీద ఏ జీవులైన, పిచ్చుకలు , కుక్కలు లాంటివి కూడా కావచ్చు. ఆ ప్రాణులు ఒక పూట ఆకలి తీరగానే ఎంతో విశ్వాసంగా ఉంటాయి.

Post a Comment

0 Comments