అత్తకి డబ్బు ఆశ.. మా వారికి అనుమానం!

                                          Image result for law images
మాకు పెళ్లయి తొమ్మిదినెలలు. మా ఇద్దరినీ పెద్దలు కుదిర్చిన రెండో పెళ్లిళ్లే. ఆతడు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ హెడ్ కానిస్టేబుల్, పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్త, మా వారు నరకం చూపించడం మొదలు పెట్టారు. మా అత్తకి డబ్బు ఆక ఎక్కువ. వారికి అనుమానం. అవిడ తరచూ పుట్టిందీ నుంచి డబ్బు తెమ్మని ఒత్తిడి చేసేది. మావారు అమెను సమర్థించేవారు.ఇక, వాళ్లిద్దరూ నన్ను ఇంట్లో పెట్టీ తాళం వేసి ఉద్యోగానికి వెళ్లేవారు. అమ్మ నాన్నలకు తెలిసి సర్దిచెప్పడానికి వస్తే వారిపై దాడిచేశారు. ఈ భాధలు భరించలేక ఇంటి నుంచి బయటపడి ఊరికి దగ్గర్లోని పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. కానీ మావారు వాళ్లని ప్రభావితం చేస్తున్నారు, పోలీసులు కేసు ఫైల్ చేయకుండా వారికి వత్తాసు పలుకుతున్నారు. నేను సర్దుకుపోవాలనుకుంటున్నా. నా భర్త నా ఫోన్లో సర్దుకుపోదాం అంటున్నాడు. ఎస్ఐ ముందు కుదరదు అంటున్నాడు.. నేను కోర్టులు, కేసులకు డబ్బులు " ఖర్చు పెట్టి స్థితిలో లేను. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. -ఓ సాదరి


ఈ ప్రశ్నకు ఒక లాయర్ ఇచ్చిన సూచనా

మీ సమస్య కోర్టుకు వెళ్తే కానీ తీరేటట్టు కానీపించడం లేదు. మీ కేసు గృహ హింస చట్టం కిందకి వస్తుంది దీనికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు దగ్గర్లోని ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మీరు అనుభవించిన బాధను చెప్పి మీ అత్తింటివారి మీద గృహహింస కేసు పెట్టండి. స్త్రీలు, పిల్లల మీద జరిగిన శారీరక, మానసిక, ఆర్థిక,లైంగిక హింసలన్నీ గృహహింస కిందకి వస్తాయి. ఏమహిలనైనా కుటుంబ సభ్యుల నుంచి హింసను ఎదుర్కొంటుంటే గృహహింస చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రక్షణ పొందవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 18,19, 20, 21, 22ల ప్రకారం రక్షణ, ఇంట్లోనివసించే హక్కు ఆర్థిక భద్రత, పిల్లల కస్టడీ, నష్టపరిహారం వంటివి కోరవచ్చు. మీ అత్త పై 488A కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కేస్ రిజిస్టర్ చేయకపోతే ఉన్నతాధికారులకు లేదా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న మహిళా కమిషన్ వారికి మీ బాధను విన్నవించుకోవచ్చు. వాళ్ళ సంబంధిత అధికారుల్ని పిలిపించి రిజిస్టర్ చేయమని ఆదేశించే వీలు ఉంది. మీరు సర్దుకుపోవాలనుకుంటుంది కాపురం చేయడానికా? విడాకులు తీసుకోవడానికా అనేది స్పష్టంగా లేదు. మీరు కలిసి కాపురం చేయాలి అనుకుంటే 'ఇక నుంచి నిన్ను వేధించను. డబ్బులు డిమాండ్ చేయను, అత్త కూడా ఎటువంటి హింస పెట్టదు' అని ఓ ఆంగీకార పత్రం రాయించుకుని సంతకాలు పెట్టి ఇవ్వమనండి. ఆలానే మీ పరిస్థితిని వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. లేదూ..విడిపోవడానికైతే మీరు పెట్టిన పె ఐర్చులు ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని పెట్టిన మానసిక, శారీరక హింసకి ఆయన వైద్య ఖర్చులు... ఇలా అన్నింటికీ కలిపి పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరవచ్చు, ఆపై ఇద్దరూ మ్యూచువల్ గా విడాకులు తీసుకోండి. ఇప్పుడు మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో మీ భర్త సర్దుకుపోదాం అంటున్నాడనిపిస్తోంది. ఒకవేళా అతను నిజంగా మారాడా లేదా అని తెలుసుకోవడానికి అతనితో కలిసి కొన్నాళ్లు కాపురం చేయడానికి యత్నించవచ్చు.. ముందు మీరు ఎలాంటి సెటిల్ మెంట్ కావాలనుకుంటున్నారో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు న్యాయ సేవలు తీసుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోతే మీ దగ్గర్లోని లీగల్ సర్వీసెస్ ఆధారిటీ వారికి మీ సమస్యను వివరించండి. న్యాయసహాయం అందిస్తారు.

Post a Comment

0 Comments