ఆఫీసుల్లో రాజకీయాలు...


                                           Image result for office
మా ఆఫీసులో  రాజకీయాలు  ఎక్కువ. గతంలో ఈ సమస్యకు భయపడి... ఒక ఉద్యోగాన్ని మానేశా, ప్రస్తుతం ఇక్కడ ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నా కూడా ఆ రాజకీయాల పట్ల అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నా.  నేనేమో వాటి గురించి ఆలోచిస్తూ...పనిపై దృష్టి  పెట్టలేకపోతున్నా. ఈ మధ్య నేనే ప్రజెంటేషన్ చేసి మా టీం సభ్యులకు చూపించా. నా సహోద్యోగి ఒకాయన ఇప్పుడేమీ చెప్పకుండా, తరువాత మా బాస్ తో అందులోని తప్పులను ఎత్తి చూపారు. చాలా అవమానకరంగానూ మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియడం లేదు. ఇక్కడా మానేసి మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిందేనా?
దీనికి ఓ సైకాలజిస్ట్ ఇచ్చిన సలహా:

కార్యాలయాల్లో రాజకీయాలనేవి మామూలే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వా టికి దూరంగా ఉండటం కూడా తేలికే. ముందు కారణమైనవారిని గుర్తించి, మీ వెనుక ఏం జరుగుతోందో తెలుసుకోగలగాలి. అప్పుడే పనిచేసే చోట ఎదుటి వారిని అర్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఆలా వ్యవహరించగలిగినవారే విధులను కూడా సక్రమంగా నిర్వర్తించగలరని ఒక అధ్యయనం కూడా పేర్కొంటోంది. దీనికి స్థాయులతో పనిలేదు. అలాగని మీరు ఆ రాజకీయాల్లో భాగం కూడా కానక్కర్లేదు. అర్థం చేసుకోగలిగే సామర్ధ్యాన్ని పెంచు కుంటే చాలు. లేదంటే ఆ ప్రభావం మీ భావోద్వేగాలపై పడుతుంది.
నిర్లక్ష్యం చేయొద్దు... కార్యాలయాలు, తరగతి గదులు సహా ఆన్లైన్లో చాలామందికి రాజకీయాలు చేయడం అలవాటు. ఉన్న స్థాయి  నుంచి కిందకు దిగజార్చడం, మోసానికి పాల్పడటం, మీ వెనుక  మీ గురించి చెడుగా మాట్లాడటం.. ఇలాంటివెన్నో ఉంటాయి.లోపాలు ఉన్నా లేకపోయినా వేలెత్తి చూపించడం, తీయగా మాట్లాడుతూ వెనక హాని చేయాలనుకోవడం, మీ ఆలోచనలను దొంగిలించడం, అవసరమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేయడం లేదా తప్పు సమాచారం ఇవ్వడం... వంటివన్నీ రాజకీయాల్లో భాగమే. ఇవన్నీ మీకు వ్యతిరేకంగా జరగొచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీరు వారిలా చేయాల్సిన అవసరం లేదు.
ఆ వ్యక్తుల ఆలోచనలను అర్థం చేసుకోగలిగితే, వారు చేయుబోయే పనిని ముందుగానే అంచనా వేసి జాగ్రత్త పడగలుగుతారు. లేదంటే మీరు ఆ సమస్యల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పట్టించుకోక పోవడు పేరుతో మీకు హాని చేయాలనుకున్న వారిని నిర్లక్ష్యం చేయొద్దు. చుట్టూ ఉండే వాతావరణాన్ని గమనించండి. అలాగే భావోద్వేగాలకు లోను కాకుండా మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. సమస్య ఎదురైన ప్పుడు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి సానుకూల దృక్ప ధాన్ని పెంచుకోండి. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండండి. సహోద్యోగులు ఇతరుల గురించి సరదాగా చెబుతున్నా సరే... వినడానికి మీకు ఆసక్తి లేదని నిర్మొహమాటంగానే చెప్పేయండి.

Post a Comment

0 Comments