యాప్ తో ఉపయోగాలివే!
ఈ యాప్లో పంట జమ ఖర్చులు రాసుకోవచ్చు. సలహాలు, చర్చావేదిక, సబ్సిడీ రుణ సమాచారం, మార్కెట్ ధరలు,వ్యవసాయ వార్తలు, వాతావరణం, సబ్సిడి, డీలర్ల సమాచారం, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మట్టి సారం పరీక్ష నమూనాతో పాటు
ఆగ్రి ఇ కామర్స్ (ఆన్ లైన్లో పంటను అమ్ముకోవచ్చు. కొనుకోవచ్చు) ఉంటాయి. రైతు
పొలానికి దగ్గర్లోని వ్యవసాయ పరికరాలను సైతం ఈ యాప్ ఉపయోగించి బాడుగకు
తీసుకోవచ్చు. 120 రకాల
పంటల పెస్ట్ మేనేజ్ మెంట్ సమాచారం ఉంది. రైతు తన పొలాన్నీ జియోట్యాగింగ్ చేసుకుని
భూసారం, అక్కడి
వాతావరణ పరిస్థితుల్ని ఎక్కడి నుంచైనా ఫోన్లో చూసుకోవచ్చు. పంటవ్యాధుల్ని
ఆరికట్టడానికి జీవామృతాలు, కషాయాలు
ఎలా చేయాలి? ఏ
పంటకు ఎలా వాడాలి? లాంటి
విషయాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందించే వ్యవసాయ
బులెటిన్న ఆప్డేట్ అవుతుంటాయి. పంటలో ఏదైనా వ్యాధి కనబడితే.. ఆకుల్ని ఫొటో తీసి
పంపితే చాలు.. ఆ వ్యాది ఏంటీ? ఎలా
నివారించాలనే విషయంపై నిపుణులు సమాధానమిస్తారు.
0 Comments