Failures Resume


      Image result for resume for interview    చేజిక్కించుకోవాల్సిన మరెన్నో  విజయాలకు ఈ సీవీ దారి చూపిస్తుంది. ఈ ఫెయిల్యూర్ సీవీ మీ కోసం మీరు రాసుకునేది. ఒకటి రెండు పేజీల రెజ్యూమ్ మీ కెరీర్ కి ముందు మాట అయితే.. ఫెయిల్యూర్ సీవీ మిమ్మల్ని మీరు తర్కించుకుని రాసుకునే పుస్తకం అన్నమాట.

ఎలా క్రియేట్ చేయాలి?
Resume లో అర్హతలు, work experience మీకు ఉన్న ఆడనపు ఆర్హతల గురించి కూడా చక్కగా రాస్తారు. ఆది చదివిన వారు మీరు రాసిన వాక్యాల మధ్యే ఆలోచించొచ్చు. కానీ, మీకు తెలుసు రెజ్యూమ్ వెనుక జర్నీ గురించి
వాటికి అక్షర రూపం ఇస్తే మీ ఫెయిల్యూర్ సీవీ రూపుదిద్దుకుంటుంది. నీకు ఇంజినీరింగ్లో 70 శాతమే ఎందుకు వచ్చింది? ఏడాదిగా ఉద్యోగాల వేటలో ఉన్నా ఎందుకు ఉద్యోగం సాధించలేకపోతున్నారు! ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలకు ఎందుకు తడబడుతున్నారు? లోపం ఎక్కడుంది! లంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మీకు ఫెయిల్యూర్ సీవీ ఉండాల్సిందే. కాస్త ఓపికతో మీ లోపాల్ని గ్రహించి రాసుకోండి ఇతరులకు సమర్పించే
పత్రం కాదు. మీకు మీరు ఇచ్చుకొనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. నిజాయితీగా నిశిత పరిశీలనలో రాసుకోండి. మీ పరాజయాలు, పరిధుల్ని రాసుకుని, వాటి పక్కనే మీలోని పాజిటివ్ అంశాల్ని జోడించండి. ఎక్కడ లోపం ఉందో విశ్లేషించండి దీంతో ఉద్యోగాల వేటలో చేసిన తప్పులే మళ్లీ చేయడానికి ఆస్కారం ఉండదు.

ఏం నేర్చుకోవాలి?
ఇంటర్వ్యూకి డైనమిక్గా రెడీ అయ్యి వెళ్లడానికి ముందే మీరెంత వరకూ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు వీలుంటుంది. బలహీనతల్ని వెతికి పట్టుకునేందుకు రాసుకునే పత్రమే ఫెయిల్యూర్ సీవి, పొందాలనుకునే ఉద్యోగం పట్ల మీరెంత నిబద్ధతతో ఉన్నారో ఇంటర్వ్యూ చేసేవారి కంటే ముందే మీకే తెలుస్తుంది. అంతేకాదు.. గతంలో మీరు చేసిన తప్పులు ఒప్పుకొంటూ.. ఆవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడొచ్చు. మీతో " మీరు సెల్ఫ  చెక్ చేసుకోవడంతో.. గుర్తుంచుకోవాల్సిన అంశాలు మదిలో బలంగా నాటుకుంటాయి. అప్పటి వరకూ అత్యంత ఎక్కువ ఒత్తిడికి గురి చేసిన ఓటమి పై విజయం మీదవుతుంది.
అందుకో సమాధానమే!
ఇంటర్వ్యూలో మీరు సాధించిన విజయాలే కాదు. మీకు ఎదురైన ఓటముల గురించి అడగొచ్చు వాటిని మీరెలా స్వీకరిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మీ నుంచి వచ్చే సమాధానంలో మానసికంగా మీరెంత బలమైన వ్యక్తి తెలుస్తుంది. మీకంటూ ఓ ఫెయిల్యూర్ సీవి ఉంటే.. తడుముకోరు. సూటిగా వారి కళ్లలోకి చూస్తూ సమాధానం చెబుతారు. మీరు చేపట్టిన ప్రాజెక్టు ఎందుకు సక్సెస్ కాలేదో వివరిస్తారు. చేసిన పొరపాట్ల నుంచి మీరేం నేర్చుకున్నారో ఆత్మవిశ్వాసంతో చెబుతారు. ఎదుటివారిని నిందించడం మానేసి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదో వివరిస్తారు. దీంతో మీలోని నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

'రివ్యూ' రాయడమే
ఓడిపోతున్నామంటే గెలవడానికి ప్రయత్నిస్తున్నట్టే. ఎప్పటికైనా గెలవాలంటే? ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకోవాలి. ఉదాహరణకు చదువుకి తగిన ఉద్యోగం చేయాలనేది మీ కోరిక. ఇంటర్వ్యూలో పదే పదే ఫెయిల్ అవుతున్నారంటే.. ఎక్కడో మీరు పసిగట్టలేని లోపం మిమల్ని ఇంటర్వ్యూ గేటు దాటనివ్వడం లేదు. అప్పుడు నిత్యం మీరు ఫార్వర్డ్ చేసే రెజ్యూమ్తో పాటు 'సెల్ఫ్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ సినిమాకి మీరు రాసుకునే రివ్యూ ఆన్నమాట. నిజాయితీగా రాస్తే లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తాయ్. ఒకవేళ మీ సెల్ఫ్ రెజ్యూమ్లో మీకు తప్పులు దొరకలేదంటే. అమ్మకో.. నాన్నకో ఫార్వర్డ్ చేయండి. లేదంటే.. మీ ప్రియ మిత్రులకు పంపండి, సూచనలు కోరండి. మీరెక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో సమీక్షించమనండి. వాటన్నింటినీ స్వీకరించి సరి చేసుకుంటే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments