పిల్లల చదువులకు, పెళ్ళిలకు పెట్టుబడి

                                Image result for ppf fund

నా దగ్గర ప్రస్తుతం  ఆరు లక్షలు ఉన్నాయి. ఇవి మా అమ్మాయి పై చదువులకు, పెళ్లికి ఉపయోగపడాలి. ఇప్పుడు మా పాపకు ఐదేళ్లు. ఈ రెండింటికి ఉపయోగ పడేలా, రాబడి ఎక్కువగా వచ్చేలా ఎలా పెట్టుబడి పెట్టాలి?
ఆర్దిక నిపుణులు ఇచ్చిన సలహా:
పిల్లల కోసం తల్లి దండ్రులు పెట్టుకునే  దీర్ఘకాలిక లక్ష్యాల్లో వారి ఉన్నతచదువులు, పెళ్లి వంటివి సహజమే. చేతిలో ఉన్న డబ్బును పాప భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకోవడం మంచి నిర్ణయం. మీరు ఆధిక రాబడి వచ్చే పథకాలను ఎంచుకోవాలి. పీపీఎఫ్, సుకన్య సమ్బద్ధి యోజనలో మదుపు చేయడం వల్ల తక్కువ నష్టభయం ఉంటుంది. పీపీఎఫ్లో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం 15 ఏళ్ల వరకు పెట్టు బడి పెట్టొచ్చు. ఏటా ఎనిమిది శాతం రాబడి వస్తుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సి కింద లక్షా యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు భవిష్యత్తులో ఆర్ధిక అవసరాలు తీర్చడానికి సహాయపడుతుంది. ఇందులో 85 శాతం రాబడి వస్తుంది. దీనిలో కూడా నన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఇందులో వడ్డీ రేట్లు మారుతుం టాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కొంచెం నష్టభయం ఉంటుంది,
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకో వచ్చు. దీర్ఘకాలికంగా మదుపు చేయాలను కుంటున్నారు కాబట్టి నష్టభయం ఉన్న మిగిలిన పధకాల కంటే రాబడి ఎక్కువగా  వచ్చేదాన్ని ఎంచుకోవడం మంచిది. ఈ పథకం చిన్నారి భవిష్యత్తు అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది.  డేట్ మ్యూచువల్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చు. మార్కెట్లో హెచ్చు తగగ్గలు వచ్చినా ఇవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 7.5 శాతం నుంచి 8 శాతం రాబడి వస్తోంది. మీ దగ్గర ఉన్న డబ్బును విభజించుకొని పైన చెప్పిన వివిధ పథకాల్లో పొదుపు చేసుకో వడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Post a Comment

0 Comments