Interview buddy


ఇంటర్వ్యూ భయం పోవాలని... కాలేజీల్లో ఎన్ని మంచి మార్కులొచ్చినా, ఇంగ్లిష్ ఎంత చక్కగా మాట్లాడగలిగినా సరే... ఇంటర్వ్యూ సమయానికి తడబడతారు చాలామంది విద్యార్థులు. అలాంటివాళ్లలోని భయం పోగొట్టడానికి ఆన్ లైన్లో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది 'ఇంటర్వ్యూ బడ్డీ' సంస్థ.ఇది ప్రతి కోచింగ్ సెంటరూ చేసే పనే కదా!' అంటారా? అక్కడే ఉంది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఈ సంస్థ వివిధ కంపెనీలకి చెందిన సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ స్థాయి అధికారులతో వీటిని నిర్వహిస్తుంది. డెలాయిట్, ఫేస్ బుక్, గూగుల్, టీసీఎస్, ఏడీటీ ఆటోమోటివ్ వంటి పెద్ద పెద్ద సంస్థలకి చెందినవాళ్లూ మన ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. విశాఖకి చెందిన ఉజ్జ్వల్ సూరంపల్లి 'ఇంటర్వ్యూ బడ్డీ' వ్యవస్థాపకుడు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఉజ్జ్వల్ ఓసారి విప్రోలో క్యాంపస్ ఇంటర్వ్యూకి హాజరయ్యాడట. అతని మాటతీరు చూసి ముచ్చటపడ్డ ఆ సంస్థ మేనేజర్ అతణ్ని తనపక్కనే కూర్చోబెట్టుకునే మిగతా విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేశాడట. యునివర్సిటీ టాపర్స్ కూడా తడబడుతుండటాన్ని అక్కడే గమనించాడు ఉజ్జ్వల్.ఇంకేముంది, ఇంజినీరింగ్ తర్వాత ఆ సమస్యని సవరించాలనే ఇంటర్వ్యూ బడ్డీని స్థాపించాడు. ఇప్పటిదాకా ఐదువేలమందికి ఇంటర్వ్యూబడ్డీ' వెబ్ సైట్ సేవలందించింది. వీళ్లలో నిరు పేద నేపథ్యం ఉన్న వెయ్యిమంది ఉచితంగానే ఈ సేవల్ని పొందారట.

Post a Comment

0 Comments