మొక్కలు ఇంటికి అందాన్ని తెచ్చి పెడ తాయి. కొన్ని సువాసనలను వెదజల్లితే , మరికొన్ని ఆకర్షణీయంగా కనిపి స్తాయి. ఇంకొన్ని ఆరోగ్యాన్నిస్తాయి. అలా పెంచుకునే మొక్కలేంటో చూద్దామా!
మరువం: ఇది సువాసనను అందిస్తుంది. దీన్ని బాల్కనీలో పెంచుకోవచ్చు. దీని ఆకులపై సన్నటి పోగులుంటాయి. ఈ ఆకుల మొదళ్లలో పరిమళాలను వెదజల్లే గ్రంథులుం టాయి. అవే సువాసనను వ్యాపింపజేస్తాయి.
మల్లె: ఇందులో చాలా రకాలు న్నాయి. బొండు మల్లె, సన్నజాజి, రెక్కమలై... ఇలా వీటిలో మీకు ఇష్టమైనదాన్ని పెంచుకోవచ్చు.. కొన్ని తీగలా పాకితే, మరికొన్ని ఒకే చోట పొదలా పెరుగుతాయి. కొంచెం పెద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మల్లెల్లో కొన్ని రకాలు సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటాయి. వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు సాంత్వననిస్తుంది.
నిమ్మ: ఈ మొక్క ఉపయోగాలు అనేకం. దీనిలోని పూలు, ఆకులు, కాండం, కాయలు... అన్నీ మనకు ఉపయోగప డేవే. ఈ మొక్క నుంచి గాఢమైన సువాసన వెలువడుతుంది. అలాగే నిమ్మ నూనెలను కొవ్వొత్తులు, సబ్బుల తయారీలో వాడతారు. బోన్సాయ్ రకం తెచ్చుకుంటే మీ ఇంటికి కొత్తందం వస్తుంది.
టీ రోజ్ బిడోనియా: ఈ పూలు ఏడాదంతా పూస్తాయి. ఇవిఅందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు సువాసనలను వెద జల్లుతాయి.. ఆర్కిడ్స్: ఈ పూలు భిన్న వర్గాల్లో, విభిన్న ఆకృతుల్లో ఉండి ఆహ్లా దాన్ని పంచుతాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు, పండగల సమయాల్లో వీటిని అలంకరణలో ఉపయోగిస్తున్నారు.
వాము: ఇది పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. ఇంటి పెరట్లో ఉండాల్సిన మొక్కల్లో ఇదొకటి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు న్నాయి. దీని ఆకులను నేరుగా తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, కడుపునొప్పిలాంటి సమస్యలు తగ్గుతాయి. .
0 Comments