ఇంట్లో పచ్చదనం

ఇంటిని పచ్చగా మార్చేయడానికి నాలుగు మొక్కలు పెట్టుకుంటాం.
ఇప్పుడు రెండుమూడు మొక్కల్ని పడకగదిలోనూ ఉంచండి. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటివే ఇవి!
Image result for స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్: ఆకుపచ్చ, లేతపసుపు రంగులో ఉండే స్నేక్ ప్లాంట్ కి నీరు, ఎండ అవసరం తక్కువే. గాల్లోని బెంజిన్, ఫార్మాల్లీ హైడ్, కార్బన్ మోనాకై డోను పీల్చుకుని, రోజంతా ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. గాలి పరిశుభ్రమవుతుంది.
Image result for కలబంద
కలబంద: ఈ మొక్కలో ఔషధగుణాలే కాదు నీటిశాతమూ ఎక్కువగానే ఉంటుంది. దాంతో వాతావరణంలో ఉండే వేడిని గ్రహించగలదు. గదిని కూడా చల్లగా ఉంచుతుంది.
Image result for గార్డెనియా
గార్డెనియా: పచ్చని వర్ణంలో ఉండే ఈ మొక్క నుంచి వచ్చే వాసన గది అంతా వ్యాపిస్తుంది. దీంతో హాయిగా నిద్రపడుతుంది. దీనికి ఎండ అవ సరం లేదు. చాలా తక్కువ వెలుతురు పడేట్లు కిటికీ పక్కగా ఉంచితే చాలు.
Image result for పీస్ లిల్లీ
పీస్ లిల్లీ: గాల్లో ఉండే బెంజిన్, ట్రైకో రోఇథిలీన్, ఫార్మాల్లీ హైడ్ ట్యాక్సిన్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటిని పీల్చుకునే గుణం పీస్లిల్లీకి ఉంది. ఈ పూలు గది వాతావరణాన్ని చల్లగా మారుస్తాయి.

Image result for మనీప్లాంట్
మనీప్లాంట్: ఈ మొక్కను తొట్టెలో పెంచొచ్చు. లేదా పడకగది కిటికీకి కూడా పాకించుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుభ్ర పరుస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Post a Comment

0 Comments