దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
దిగ్ర్భాంతికర విషయాలను వెల్లడించింది. గత ఏడాది నమోదైన లైంగిక దాడులు, అత్యాచార కేసుల్లో 50శాతం మందికి పైగా నిందితులు ఇరుగు, పొరుగు వారేనని తెలిపింది. మొత్తం 95శాతం కేసుల్లో బాధితులకు తెలిసిన వారే నిందితులని
విస్తుగొలిపే నిజాన్ని చెప్పింది. కాగా ఈ విషయంలో పిల్లలకు పెద్దలు చైతన్యాన్ని
కలిగించాలని నిపుణులు సూచించారు.
0 Comments