నలుగురిలో మాట్లాడలేను..

                                Image result for presentation

మా బాస్ చాలా ప్రోత్సహిస్తారు. ఉద్యోగులు ఎదుర్కొనే సవాళ్ళపై ఆవిడకు పూర్తి అవగాహన ఉంది. నాలాంటివాళ్ల సమస్యలు తెలుసు. అందుకే నా విధులను విజయవంతంగా పూర్తిచేయడానికి ఆమె చాలా
అవకాశాలు ఇస్తున్నారు. 'ముఖ్యమైన సమావేశాల్లో ప్రజెంటేషన్స్ ఇచ్చే దిశగానూ ప్రోత్సహిస్తుంది. ఆమె సహకారంతో నా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నా. నాకది సమస్య కాదు కానీ... జన్మతః నాకంటూ సహజసిద్ధమైన వాగ్దాటి లేదు. దాంతో ఎక్కడైనా మాట్లాడాల్సినప్పుడు, జెంటేషన్స్ ఇవ్వాల్చినప్పుడు ఒత్తిడిగా అనిపిస్తుంది. సరిగ్గా మాట్లాడలేనేమోనని కంగారుపడతా, ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఎలా?
- ఓ ఉద్యోగి
ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా ఎవరికైనా ఒత్తిడే, భయమే. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
సాధన:
దీనికి ఒక సైకాలజిస్ట్ ఇచ్చిన సలహా..
 మీరు చేయబోయే ప్రెజెంటేషన్ ను ముందుగా సాధన చేయాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా దీనికోసం కొంత సమయాన్ని కేటాయించాలి. మీరు మాట్లాడబోయే అంశాన్ని ముందుగా రాసి, చదువుకుంటే పద ఉచ్చరణతోపాటు, ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ వేగంగా మాట్లాడాలో ఓ స్పష్టత ఉంటుంది. నిల్చునే విధానం, కూర్చోవడం వంటివి కూడా ముందుగానే సాధన చేస్తే ఆ ప్రసంగానికి నిండుదనం వస్తుంది, దానిని రికార్డు చేసి పరిశీలిస్తే మీకు మీరే అవసరమైన మార్పులు చేసుకోవచ్చు, స్పష్టంగా, వేగంగా: మీ మాటలు స్పష్టంగా, చురుగ్గా ఉంటేనే ఎదుటి వారిని ఆకట్టుకోగలరు. అధ్యయనాలు ఇదే చెబుతున్నాయి. సాధారణంగా అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగించే పరిపూర్ణత ఎవరిలోనూ ఉండదు. చురుగ్గా మాట్లాడటమే సరైన పద్ధతి. వేదిక పైకి ఉత్సాహంగా వెళితే చాలు. దైర్యం అదే వస్తుంది
వినండి:
 మీరు ప్రసంగించే అంశం గురించి ఇతరులు ఎవరైనా మాట్లాడుతుంటే వినండి. అలాంటి కార్యక్రమాలు వెళ్లే ఆ ప్రేక్షకుల అభిరుచి, అభిప్రాయాలు తెలుస్తాయి. ఎటువంటి అంశాలపై వారు ఆసక్తి చూపుతున్నారో అర్ధమవుతుంది. ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా తెలుస్తుంది.
వేళకు వెళ్లేలా:
 మీరు ప్రసంగించే చోటుకి ముందుగానే చేరుకోవాలి, ఎంత త్వరగా ఆడ ఉంటే, . అంతగా మీపై ఒత్తిడిఉండదు. ముందుగా కొంత సమయం హాజరైనవారితో మాట కలపాలి. దానివల్ల వారి సందేహాలేమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అనుకూలంగా ఇలాంటి సమయంలో ప్రతికూలతలకు చోటివ్వకూడదు. సానుకూల దృక్పధాన్ని పెంచుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తానని ఆనుకోవాలి. మీ ముఖంలో ఆది ప్రస్పుటమవ్వాలి. ఉత్సాహంగా మీరు మాట్లాడే ప్రతీ మాటా ప్రేక్షకుల మనసులోకి చేరుతుంది

దీర్ఘ శ్వాసః
ఒత్తిడిగా ఉన్నప్పడు కండరాలన్నీ బిగుతుగా ఆయిపోతాయి. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఇలాంటప్పుడు దీర్ఘశ్వాస తీసుకోవాలి. దీంతో మెదడుకు ప్రాణవాయువు అంది, శరీరం విశ్రాంతి పొందుతుంది.
చిరునవ్వు
సంతోషంగా నవ్వుతూ ఉంటే... శరీరంలో ఎండార్ఫిన్లు పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆత్మవిశ్వాసంతోపాటు చురుకుదనం సొంతమవుతుంది. సీరియస్ గా ప్రసంగిస్తే, ఎదుటివారిని మెప్పించలేరు.
ఆగి ఆగి మాట్లాడేలా:
 వేగంగా ప్రసంగిస్తే చివరిలో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. పైగా అర్ధంకాకపోవచ్చు. అది కూడా ఒత్తిడికి దారితీస్తుంది, పెంచుతుంది. అందుకే మాట్లాడుతూ మద్యలో ఆగుతూ,కొనసాగించాలి. అప్పుడు మీ వాగ్ధాటి కూడా వేగంగా ముందుకు సాగుతుంది. ఎప్పుడైనా మధ్యలో మీ మాటలకు బ్రేక్ పడుతోందని అనిపించినప్పుడు కాస్త విరామం తీసుకోవడం మంచిది.

Post a Comment

0 Comments