సాగు అద్దె యంత్రాల వివరాలకు జేఫార్మ్ యాప్


సాగు అద్దె యంత్రాల వివరాలకు జేఫార్మ్ యాప్ ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

ఆద్దె యంత్రాల ద్వారా చిన్న,  సన్నకారు రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే వీలుంటుందని వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉబరైజేషన్ విధానంలో భాగంగా టఫే ట్రాక్టర్ తయారీ సంస్థ జే ఫార్మ్ సర్వీస్' మొబైల్ అప్లికేషన్ ను తయారు చేసింది. గురు వారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చంద్రమోహన్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయ విస్తరణ సిబ్బంది కూడా ఈ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవ సాయ శాఖ అభివృద్ధి చేసిన రైతు సేవ యాప్తో దీన్ని అనుసంధానించాలన్నారు. దీనిపై రైతులు, వ్యవసాయ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని టఫే సంస్థ ఆపరేటింగ్ అధికారి టీఆర్ కేశవన్ తెలిపారు. కార్పొరేట్ బాధ్యత కింద యాప్ తీసుకొచ్చామని చెప్పారు.

Post a Comment

0 Comments