జీతం పెంచమని అడగవచ్చా!


                                         Image result for salary
నేనో ప్రముఖ సంస్థలో కిందిస్థాయి ఉద్యోగిగా చేరా. మూడేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా, నా బాధ్యతల్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తా, మంచి పేరే తెచ్చుకున్నా, నా బాధ్యతలనే కాదు... సహోద్యోగులను కూడా గౌరవంగా చూస్తా, ఎంత బాగా పనిచే సున్నా కూడా జీతం మాత్రం పెరగడం లేదు. నేనీ ఉద్యోగంలో చేరినప్పుడు అధికారులు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నా జీతాన్ని పెంచడం లేదు. అడిగితే...తక్కువ మొత్తంలో పెంచుతా మంటున్నారు. దాంతో చాలా అసంతృప్తికి గురవుతున్నా,ఏడాదికి కనీసం రెండు శాతం కూడా పెరగలేదు. సహోద్యోగులతో పోల్చుకుని నా సమస్యను ప్రస్తావించడం నాకు ఇష్టంలేదు. అలా మాట్లాడలేని పరి స్థితి కూడా. ఇప్పుడు నా జీతాన్ని పెంమని ఎలా అడగాలి.. నా సహోద్యోగు లతో వాళ్ల ఆదాయం చర్చించకుండా, వాళ్ల జీతాల గురించి ప్రస్తావించకుండా ఈ సమస్యను పరిష్కరించుకునేదెలా?
దీనికి ఓ సైకాలజిస్ట్ ఇచ్చిన సలహా....
జీవితంలో మొదట మీరు తెలుసుకోవాల్సిన విషయమేంటంటే... అడగందే అమ్మయినా పెట్టదు. అలాగే మీరు అడగనంత కాలం, ఏదీ మీకు దక్కదు. ఎప్పుడైనా సరే... ఉద్యోగంలో చేరిన ఏడాది తరువాత జీతం  పెంచమని అడగడానికి అనువైన సమయం. అప్పటికి మీకు కాస్త ఉద్యోగానుభవం వచ్చి ఉంటుంది. ఎప్పుడైనా ఓ సంస్థ కొత్తగా ఉద్యోగులను చేర్చుకుందంటే ఆ ఉద్యోగి తన సామర్ధ్యాన్ని చూపేంతవరకు, సదరు సంస్థ రిస్క్ తీసుకున్నట్లే. ఎప్పుడైతే మీకు ఆప్ప గించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో మీరు నేరవే రుస్తారో... ఆ సంస్థ అప్పుడు ఆ రిస్క్ నుంచి బయటపడినట్లవుతుంది. అలాగే మీరు మీ జీతాన్ని పెంచమని అడిగే ముందు, ఇప్పటివరకూ మీరు చేపట్టిన విధులు, వాటి వల్ల సంస్థకు కలిగిన ప్రయోజనాలను పై అధికారి ముందుంచడం తప్పనిసరి. అంతేతప్ప ఇతరులతో పోల్చి జీతం పెంచమని అడగడం సరికాదు. కాబట్టి నేరుగా సమస్యనే వివరించండి. ఇప్పుడు కాకపోయినా మరో రెండుమూడు నెలల తరువాత ఆయినా ఆలోచిస్తుంది యాజమాన్యం.

ఆలాగే అసంతృప్తికి గురికావడం వల్ల పనిపై దృష్టి పెట్టలేరు. అది మీ ఉత్పాదకతను తెలియజేస్తుందని మరవకండి. పనిచేస్తూనే మీ సమస్యను పరిష్కరించుకునేలా చూడాలి. • మీరు ఎంత వేతనాన్ని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మీకు సంస్థ చెల్లిస్తున్నది సరైనదేనా వంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఓ పనిచేయండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి బయట మరో సంస్థ అయితే ఎంత వేతనాన్ని ఇస్తుందో తెలుసుకోవచ్చు. దాని కోసం మీరు మరో సంస్థలో దరఖాస్తు చేసుకున్నా ఫరవాలేదు. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన ఉంటేనే ఇలా చేయాలి. అలాగే కొత్తగా మీరు వెళ్లాలనుకుంటున్న సంస్థ కూడా మీరు ఎంత జీతం ఆశిస్తున్నారనేది తెలుసుకుంటుంది. ప్రస్తుతం మీరు ఎంత వేతనాన్ని తీసుకుంటున్నారో, దానిపై 10 శాతాన్ని అధికంగా డిమాండ్ చేయొచ్చు. మీరు అడిగినంత ఆ కొత్త సంస్థ మీకివ్వకపోవచ్చు. అయితే మీరు ఎంత ఆశి స్తున్నారనేది ముందుగానే చెప్పాలి.

Post a Comment

0 Comments