ఏ రాష్ట్రంలో నారద మహర్షి ఆలయం ఉంది?

 ఏ రాష్ట్రంలో నారద మహర్షి ఆలయం ఉంది?



సినిమాల పుణ్యమా అని మన తెలుగు వాళ్లకు..ఈ బ్రహ్మమానస పుత్రుడులో దైవత్వం కనపడదు సరికదా..... ఒక కలహభో జనుడు,నిప్పు లేకుండా మంట పెట్టే ఒక మనిషి మాత్రమే కనపడతాడు.. కదా!! 


సరే ప్రశ్న లోకి వెడితే..  


1️⃣ వీటిల్లో మొదటిది కర్ణాటక రాష్ట్రం, దావణగెరె జిల్లాలో చిగాతేరి(Chigateri)లో ఉన్న నారదముని ఆలయం. ఆ జిల్లాతో పాటు బళ్లారి, చిత్రాదుర్గ జిల్లాల భక్తులు ఎక్కువగా వస్తారట దర్శనానికి. 


2️⃣ ఇంకోటి మహారాష్ట్రలో పంధరపూర్ కు చాలా దగ్గర లో ఉన్న ఈ దేవాలయం. షెగావ్ దూమల(shegaon Dumala)లో ఉంది. చూస్తే ఇది భీమా నది మధ్యలో ఉన్నట్టు కనపడుతోంది. పెద్దగా వివరాలు దొరకటల్లేదు.. ఈ ఫోటోలు తప్ప.


3️⃣ మూడోది.. ఉత్తరప్రదేశ్, మధుర జిల్లాలో బృందావన్ కు దగ్గరలో గోవర్ధన్(బ్రజ్ భూమి..కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన చోటు)కు దగ్గర్లో గోవర్ధన్ బ్రాహ్మణన్ లో ఉంది. ఈ గోవర్ధన్ కు దగ్గర్లో చాలా "కుండ్"లు ఉన్నాయి.. వాటిల్లో "నారద కుండ్"ఒకటి. ఇక్కడ నారదులవారు కొంతకాలం తపస్సు చేసి, "నారద బ్రహ్మ సూత్రాలు" వ్రాసారు అని చెప్తారు.


4️⃣ ఇంకా నీనూ గ్రామం,(కుల్లూ జిల్లా,హిమాచల్ ప్రదేశ్) లో ఉన్న నారదముని ఆలయానికి అయితే చాలా విశేషమే ఉంది. ఆ వూరి వాళ్లకు ఈయన చాలా పెద్ద దేవుడు. ఈయన ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు వీళ్లకు చెప్తాడు అనీ ఇక్కడి వాళ్ల నమ్మకం. అలాగే వానలు లాంటి వాటినించి రక్షించమని ఈయనకే ప్రార్దిస్తారట.


ఇంకా కుల్లూ(హిమాచల్ ప్రదేశ్), ఘేటి(గుజరాత్)లో కూడా నారదమునికి దేవాలయాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments