కళ్ళముందు చాలా అవకాశాలు కనిపిస్తాయి. కానీ స్వతహాగా
మొహమాటం వల్ల ఆ అవకాశం కోల్పోవలసివస్తుంది. ఒక పని చేస్తే ఎవరో ఏదో అనుకుంటారని
మనస్సులో ఒక విధమైన భయాన్ని కలిగి ఉండడమే మొహమాటం. మొహమాటం ఉన్నవాళ్లు జీవితంలో
అభివృద్దిలోకి వెళ్ళలేరు. మరి మొహమాటాన్ని వదిలేయాలంటే, నేను ఈ ప్రశ్నలు
వేసుకుంటాను నాతో.
1.
ఈ పని విషయంలో నేను మొహమాటపడితే కోల్పోయేదేమిటి, దాని
విలువ ఎంత అని.
2.
ఎవరైనా దాని గురుంచి ప్రశ్నిస్తే సమాధానాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుతాను.
ఒక వేళా అడిగితే అదే ఖచ్చితంగా, గట్టిగా చెబుతాను.
ఈ మొహమాటం వల్ల మనం పొందవలసిన అవకాశాలను ఇతరులు దోచుకుపోతారు. మొహమాటం అంటే ఎవరైనా సహాయం
చేయమని అడిగితే ఆ సమయంలో నీకు అత్యవసర పని ఉన్న అది ప్రక్కన పెట్టి వారికి ఆ పని
చేస్తానని చెప్పడం కూడా.
అదే వద్దు. చాల సందర్బాలలో నో చెప్పడం కూడా అలవాటు
చేసుకోవాలి లేదంటే భగవంతుడు మనకిచ్చిన అవకాశాలను, సమయాన్ని కోల్పోవలసివస్తుంది.
మొహమాటానికి ముఖ్యకారణం భయం, సిగ్గు. ఈ రెండింటిని మనస్సు నుండి ఎంత త్వర త్వరగా తరిమెస్తే అంత
మేలు.
0 Comments