ఈ రోజుల్లో ప్రతి మనిషికి వ్యసనాలు ఉండడం సహజం.
ఎందుకంటే అలంటి ప్రపంచంలో ఉన్నాం మరి. కొందరు టెన్షన్ పోవడానికి సిగరేట్,మద్యపానం
చేసి నెమ్మది నెమ్మదిగా వాటికీ బానిసలవుతారు. ఏదైనా మితంగా ఉంటే మేలు చేస్తుంది.
కానీ అదే అతి అయితే హాని చేస్తుంది.
ఈ వ్యసనాలలో మంచివి, చెడ్డవి కూడా ఉన్నాయండోయ్. ఏ
వ్యసనలైతే అభివృద్దిలోకి మరియు ఉపశమనాన్ని ఇస్తాయో అవి మంచివి. ఉదాహనకు ఖాళీ సమయం
దొరికినప్పుడల్లా, టెన్షన్ లో ఉన్నపుడు పాటలు పాడడం వంటివి. ఏ వ్యసనలైతే ఉన్న
స్థితి నుండి క్రిందకు దించుతాయో, సమయాన్ని దోచేస్తాయో అవి చెడ్డవి.
చెడ్డ వ్యసనాలను మంచి వ్యసనాలతో మార్పిడి చేయాలి. ఇలా
replace చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
1.
ఏ సమయానికి ఏమి చేయాలో ఆ రోజు ఉదయాన్నే లిస్టు రాసి
పెట్టుకోవాలి.
2.
పనులన్నీ అయిపోయినా, మనస్సు విసుగు చెందినా, ఖాళీ
దొరికినా వెంటనే మనస్సుకు ఊరటనిచ్చేవి, అభివృద్దిలోకి తీసుకెళ్ళే కళలపై దృష్టి
పెట్టాలి.
3.
ఏ చిన్న అవకాశానికి తవుఇవ్వకుడదు. అంటే ఒక 5 నిముషాలు
స్టేటస్ చూడడం, కామెడీ వీడియోస్ చూద్దాం అని సడలితే సమయం అయిపోవచ్చు, అలాగే
వ్యసనాలకు లోనుకవచ్చు.
అసలు వ్యసనాలకు మూలకారణం ఏమిటంటే.. ఒక సామెత గుర్తుకొస్తుంది.
“” ఖాళీగా ఉన్న ఇంటిలోకి దెయ్యాలు ప్రవేశిస్తాయంటారు”
ఖాళీగా ఉన్న మైండ్ లోకి కూడా అంతే... ఉదయం లేచిన
దగ్గరనుండి రాత్రి నిదురించేవరకు పనులన్నీ ప్రణాళిక బద్దంగా ఉండాలి. లేదంటే
బుర్రలోకి వ్యసనాలనే దెయ్యాలు వచ్చేస్తాయి మరి.
0 Comments