నేను రోజు స్కూల్
కి వెళుతున్నాను. కానీ ఒక రోజు స్కూల్ మనేయలనిపించింది. నేను రోజు సంగీతం
నేర్చుకుంటూనాను కొంత సమయం కేటాయించి. కానీ ఒక రోజు మనస్సు ఎందుకో ఆ పని వద్దు
వేరే పని ఏదో ఒకటి చేయమని చెప్పింది. దాని మాట లెక్క చేయకుండా పని ప్రారంభిస్తే
దానిపై శ్రద్ద రాదు. ఈ మాయదారి మనస్సు నా మాట వినలేదుగా తగిన శాస్తి జరిగింది
అంటుంది.అలా రెండు మూడు సార్లు నేర్చుకోవడానికి అంతరాయం ఏర్పరిస్తే ఇక అంతే ఆ
కోర్స్ పూర్తివదు.
నిజమే టైపింగ్
నేర్చుకుంటానని చెప్పి డబ్బులు కట్టి 5 రోజులు వెళ్ళి మానేశాను. స్పోకెన్
ఇంగ్లీష్ క్లాసుకి 10 రోజులు వెళ్ళి తరువాత మానేశాను.
ఇలా ఎందుకు
జరుగుతుంది! హా... మనస్సు పని యొక్క ఫలితం మీద దృష్టి పెడుతుంది. మనస్సుకి
ప్రారంభిచిన పని యొక్క లేదా నేర్చుకోట్టున్న విద్య యొక్క
ఫలితాన్ని పూర్తిగా వివరించకపొతే దాన్ని పట్టించుకోదు.
ఉదాహరనకు.....
టైపింగ్ నేర్చుకోవడం వల్ల చూడకుండా టైపు చేయగలనని, ఫాస్ట్ గా వర్క్ చేయగలనని, డేటా ఎంట్రీ
చేసి డబ్బులు సంపాదించగాలనని మనస్సుకి పూర్తిగా వివరించగాలిగితే అప్పుడు ఆ పని
లేదా విద్య పై ఉత్సాహాన్ని కోల్పోదు.
ఒక మహాకవి
అన్నాడు.... జీవితంలో ఒక్కసారి , అయిన నువ్వు నీతో మాట్లుడుకోవాలి. లేదంటే ఒక
గొప్ప మిత్రుడిని కోల్పోతావు.
0 Comments