ఈ పదం యొక్క అర్ధం ఈమధ్యనే తెలుసుకున్నాను. ప్రసుత జీవనం లో మనుషులమైన మనం ఒత్తిడిల నుండి పారిపోలేము అలాని ఎదుర్కోనలేము. ఈ విషయం ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులకి బాగా తెలుస్తుంది.
ఈ ఒత్తిడులు Human Emotions నుండే వస్తున్నాయి. అంటే నువ్వు ఎదుటివారి Emotions ని నియంత్రించలేవు. కానీ నిన్ను నీవు నియంత్రించుకోగాలవు. మనస్సును
ప్రశాంతంగా ఉంచుకున్నపుడే ఒత్తిడులకు గురికాకుండా ఉంటాము.
దాని కొరకు
ఏదైన ఒక ఆటవిడుపును ఎంచుకోవాలి. అంటే సంగీతం,డ్రాయింగ్, పాటలు పాడడం, క్రొత్త భాషలు
నేర్చుకోవడం వంటివి. ఎంచుకున్న ఆ ఆటవిడుపును కనీసం 60 రోజులు
కొనసాగించాలి. ఉదాహరణకు మీరు డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టారు అనుకొండి !
దానిని మీకు
చిరాకు కలిగినపుడు, ఒత్తిడిగా ఉన్నపుడు , ఖాళి సమయంలో 60 రోజులు సాధన
చేస్తే, మీకు అందులో నైపుణ్యం వస్తుంది. నాకు తెలిసి ఒత్తిడులను ఎదుర్కోవడానికి
ఇది ఒక మంచి మార్గం.
ప్రముఖ కళకారులను మీరు గమనిస్తే
వాళ్ళు ముఖంలో చిరునవ్వు ఉంటుంది . అంతేగాక వాళ్ళు సంతోషంగా కూడా కనిపిస్తారు. నాకు తెలిసి ఒత్తిడి నుండి
ఉపశమనం పొందడానికి ఆటవిడుపులే ఒక మంచి మార్గం
0 Comments