
ప్రతి
రోజు మనం కొంత సమయాన్ని కేటాయించాలి ఇలా
ఆలోచించడానికి
సమయాన్ని కేటాయించాలి అది శక్తికి మూలం
చదవడానికి
సమయాన్ని కేటాయించాలి అది వివేకానికి మూలం
శ్రమించడానికి
సమయాన్ని కేటాయించాలి అది విజయానికి మూలం
భగవంతుడిని
వేడుకోనేందుకు సమయాన్ని కేటాయించాలి అది మనఃశాంతికి మూలం
ఎప్పుడు
కూడా గతం నుండి నేర్చుకోవాలి, భవిష్యత్తు కోసం సిద్దం అవ్వాలి కానీ వర్తమానంలో
జీవించాలి.
మనషుల్లో
చాలా మందికి వాళ్ళని గురుంచి ఆలోచించే సమయం ఉండదు కానీ వేరేవాళ్ళ గురుంచి , వాళ్ళు
తమ గురుంచి ఏమనుకుంటున్నారో అని, ఇతరులను మెప్పించడానికి సమయం కేటాయిస్తారు. తప్పు
లేదు. ఎప్పుడో జరిగిన సంఘటనలు ప్రస్తుతాన్ని కూడా నిర్ణయిస్తాయి. కానీ వర్తమానలో
జీవిస్తూ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలంటే మాత్రం ప్రతి మనిషి తన గురుంచి తను
తెలుసుకోవడాని సమయాన్ని కేటాయించాలి కనీసం 5 నుండి 10 నిమిషాలైన సరే. ప్రతి
వారిలోనూ ప్రత్యేకత ఉంది కానీ దానిని వారికి వారె గుర్తించగలగాలి.
0 Comments