మన కష్టాలను ఇతరులతో చెప్పుకోవచ్చా!

                            Image result for emotional pain

కష్టం వస్తే దానిని ఇతరులతో పంచుకొంటే కొంత భారం దిగుతుంది అంటారు. మరి ప్రస్తుత జన అరణ్యంలో ఇది పనిచేస్తుందా! సరే!
రాజు ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. రోజు అతని బాస్ తిడుతుంటాడు అతను ఎంత కష్టపడి పనిచేసినా! బాస్ తనను తిడుతున్నాడని తన సన్నిహితులతో, సహోద్యుగులతో చెప్పుకుని వాపోతూ ఉండేవాడు. కానీ బాస్ చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కారణం ఏమయిదంటరు?
నిజానికి 98% మంది ప్రజలు మనం చెప్పేది పట్టించుకోరు. 2% మంది మనం కష్టంలో ఉంటే సంతోషపడతారు లోలోపలా. అలాగే వాళ్ళు మన కష్టాలు ఇంకా పెరగడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటారు. రాజు తన సహోద్యుగులతో చెప్పినపుడు వాళ్ళు  రాజు గురుంచి బాస్ కి చెడుగా చెబుతుంటారు. దాని వల్ల రాజు రోజు భాదపడవాల్సివస్తుంది.
ఇంకా రాజు తన సన్నిహితులతో చెప్పడం వల్ల కొన్ని రోజుల తర్వాత రాజుని అతని స్నేహితులు ఎగతాళి చేయడం, ఆటపట్టించడం మొదలుపెట్టారు. కారణం రాజుని వాళ్ళ బలహినుడిగా నిర్దారించుకున్నారు.
బాధ కలిగినపుడు కడుపులోనే ఉంచుకోవడం కష్టం. కాబట్టి దాని గురుంచి డైరీలో వ్రాసుకోవడం, భగవంతుడిని వేడుకోవడం మంచిది.
ఇంకా ఎవరైతే ఇతరులను మోటివేట్ చేస్తారో వాళ్ళతో చెప్పడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.కష్టాలు పోవాలంటే ఏకాంతంగా కూర్చొని విశ్లేషించుకొని, పరిష్కారాల మార్గాల కోసం మెదడుకి ప్రశ్నలు ఇవ్వాలి. అప్పుడది సమాధానాలును ఛాయస్ రూపంలో ఇస్తుంది.

Post a Comment

0 Comments