అది చలికాలం. దుప్పటి
ముసుగుపెట్టి పడుకున్నాను. ఇంతలో అమ్మ వచ్చి దుప్పటి లాగి ఉదయం 6గం. అయ్యింది అని
భారతం మొదలుపెట్టింది. హా.. ఇక నిదురపడుతుందా! పట్టలేదు. లేచి కాలకృత్యాలు
తిర్చుకొన్నాను. ఇంతలో పొలానికి వెళ్ళు అని అమ్మ ఆర్డర్ పాస్ చేసింది. తప్పుతుందా
సైకిల్ తీసుకోని పొలానికి వెళ్ళాను.
ప్రొద్దున్నే మంచులో
చేను కప్పబడి ఉంది. సైకిల్ దిగి చేల గట్లపై నడుస్తూ ఉంటె.. చేల గట్లపై గరికకు ఉన్న
మంచు బిందువులు కలికి తగిలి అత్భుతమైన ఆహ్లాదాన్ని కలిగించాయి. గట్టు నుండి వరి
పైర్లు ను చేతితో తడుముతుంటే మనస్సులో మదురనుభుతి కలిగింది. ఆ సమయంలోనే సూర్యుడు
మంచును చిల్చుకొని పైకి వస్తున్నాడు. ఉడతలు చేలగట్లపై చెంగు చెంగున గెంతుతూ
కొబ్బరి చెట్లపైకి వెళ్తున్నాయి.
ఉదయాన్నే కదూ! పొలంలో
సాగే నీళ్ళు బహు చల్లగా ఉన్నాయి. చుట్టూ చుస్తే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. చేను
దగ్గరే ఉండి ప్రకృతి అందాన్ని, పచ్చదనం యొక్క అందాన్ని ఆస్వాదించి ఇంటికి తిరిగి
వెళ్ళాను మదిలో ఆ అనుభూతిని భద్రపరచుకొని.
0 Comments