అటు ఏడూ తరాలు ఇటూ ఏడూ తరాలు

                        Image result for indian joint family

పూర్వం ఒక పెళ్లి చేయాలంటే అటూ ఏడూ తరాలు ఇటూ ఏడూ తరాలు చుడలనేవారు. అంటే ఏడూ తరాలుగా ఆ కుటుంబం పై ఏ మచ్చ లేకపోతే ఆ కుటుంబం గొప్పదని. ఇంక మాములుగానే పూర్వం కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబలు.
మరి ఇప్పుడు కుటుంబం ఎటువంటిది, అమ్మాయి, అబ్బాయి గుణగణాలు ఎటువంటివి అనేవి కాకుండా ఆస్తుల గురుంచి, అబ్బాయితే ఉద్యోగం, ఉద్యోగంలో వచ్చే సంపాదన గురుంచి మాత్రమే చూసి పెళ్లి జరిపించేస్తున్నారు.అందుకే ఎక్కువ జంటలు కోర్టు బాట పడుతున్నాయి అలాగే మనశాంతిని కోల్పోతున్నారు.
అబ్బాయినా,అమ్మయినా వాళ్ళ జేవితంలో లక్ష్యాలు లేకుండా ఉంటె వాళ్ళకి వివాహం జరిపితే వాళ్ళ జీవితంలో కల్లోలం ఏర్పడక తప్పదు. అందుకే జీవితంలో లక్ష్యాలు ఉన్నవారికి ప్రాధ్యాన్యం ఇవ్వాలి.
ఇక పూర్వ వైభవానికి వస్తే పెద్దలు ఆ కుటుంబాన్ని ఎలా అంచనా వేసేవారంటే
1.ఎప్పుడూ ఎవ్వరితో గొడవలు పెట్టుకోకపోవడం
2. పశువుల పెంపకం
3.వ్యవసాయం
4.ఉమ్మడి కుటుంబం
5.అబ్బాయి,అమ్మాయి గుణగణాలు, మరియు సాధించినవి
ఇక్కడ ఇల్లు కూడా అత్యంత ప్రదానం. ఇంటి వాకిలి శుభ్రంగా ఉండడం,ఇంట్లో పూజ గది, గోడలమీద పటాలు, ఇంట్లో వారి మాటలు,నడత. ఇవన్ని ఇంటి వాతవరణాన్ని ఇంట్లో మనుషుల నైజాన్ని తెలియచేస్తాయి. ఇవన్ని వాళ్ళు ఆలోచించారూ కాబట్టే ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.

Post a Comment

0 Comments