నెగిటివ్ ఇమేజినేషణ్ ప్రభావం ఎలా ఉంటుంది
Imagination is powerful than knowledge.
ఈ quotation విన్నపుడు చాల బావుంది. కానీ ఇందులో
నెగటివ్ imagination కూడా
ఉంది. మనలో చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఇంత విపరీతమైన ఆలోచనలను కంట్రోల్ చేయడం ఎలానో
కూడా తెలియదు. ఒక విషయం గమనిస్తే మనుషులమైన మనం ఎప్పుడు గతాన్ని గురుంచి,
భవిష్యత్తు గురుంచి ఆలోచిస్తాం. ముఖ్యంగా చేదు అనుభవాలను తలచుకొని వాటిని
సరిచేయడానికి imagination చేస్తాం.
ఉదాహరణకు ఆఫీసులలో బాస్ మన తప్పు
లేనపుడు కూడా మనల్ని నిందించినపుడు అతనికి సరైన బుద్ది చెప్పాలని ఊహగానాలు చేస్తాం.
ఆలాంటి సమయంలో నేర్వేస్ గా అనుభూతి చెందినట్లయితే అదే negative
imagination. ఈ Negative imagination సమయంలో
గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం, ఆవేశం కలగడం జరుగుతుంది. తన కోపమే తన శత్రువు
అంటారు ఇదే కావచ్చు. గతాన్ని సరిచేయాలంటే వర్తమానాన్ని మార్చాలి. అప్పుడే
భవిష్యత్తులో గతాన్ని చూడగలం.
Negative imagination మనలోని
శక్తిని హరింపచేస్తే Positive imagination మనలోని శక్తిని పెంచుతుంది. ఎలా అంటే ఒక
సైకాలజిస్ట్ ఒక వ్యక్తిని వశికరం ద్వారా బలవంతుడిగాను చేయగలడు లేదా బలహినుడుగా
చేయగలడు. సామాన్యుడు అసామాన్యుడుగా మారాలంటే positive imagination మాత్రమే
దారి. గతంలోని సంతోషాలను, భవిష్యత్తులో చేయవలసిన గొప్ప పనులను పదే పదే మననం
చేసుకున్నపుడే అది సాధ్యమవుతుంది.
0 Comments