దీపావళి ఎందుకు జరుపుకుంటారు?
పూర్వ వృతాంతం:
పూర్వం
నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు మానవులను హింసిస్తూ ఉండేవాడు. వాడిని
శ్రీకృష్ణుడు చంపలేడు. ఎందుకంటే వాడు తన తల్లి చేతిలోనే మరణించాలని వరం పొందాడు
కాబట్టి. వైకుంటంలో ద్వారపలకులలో ఒకరే ఈ నరకాసురుడు. కొన్ని తప్పిదాల వల్ల ఆ
ద్వారపాలకులు రాక్షస జన్మ ఎత్తవలసి వస్తుంది. ఆ విధంగా భూమాత నరకాసురుని తల్లి
అవుతుంది. ద్వాపర యుగంలో భూమాత సత్యభామగా అవతరిస్తుంది. ఏ తల్లి తన చేతులతో తన
కొడుకుని చంపలేదు. కానుక విష్ణు మాయ వలన సత్యభామ చేతిలో నరకాసురుడు చంపబడతాడు.
వాడి పీడ విరగడ అయి తమ జీవితాలలో వెలుగులు వచ్చినందుకు సంతోషంగా దీపావళి
జరుపుకుంటున్నారు.
ఋషుల ప్రభావం:
ఈనాడు
మనం శాస్త్రవేత్తలుగా పిలుచుకుంటున్న మన భారతీయ ఋషులు ఒక గొప్ప పని చేసారు ఆచారాల
రూపంలో. మన ఆచారాలలో సైన్సు కి కూడా అంతుచిక్కని అత్భుతలు ఎన్నో ఉన్నాయి. ఈ
దీపాలను వెలిగించడానికి నువ్వులా నూనె వాడుతారు. అందువల్ల దీపం నుండి వచ్చే పొగ
శీతాకాలం వల్ల మనుషులలో కలిగే మార్పులను నయం చేస్తుంది. ఆ కాంతులు వల్ల మానవులకు,
ఇతర జీవాలకు హాని చేసే క్రిములు, జీవాలు చనిపోతాయి. ఆలాగే ఇంటిముందు ఆవుపేడతో
కల్లాపు చల్లి పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలు, అలంటి జీవాలకు ఆహరం
పెట్టినవాళ్ళు అవుతారు ఇంకా అందం ఏర్పడుతుంది.దీపావళి రోజున వాడే ఆ మట్టి
పమ్మిదలు, నువ్వులా నూనె, ఆ వత్తులు, అమ్మవారిని పూజించే విధానం, శాస్త్రీయ
పద్దతులలో వాడే దుస్తులు రమణీయం. మనస్సు ఉపయోగించి మనోనేత్రం తో ఆ విధానం గురుంచి
విశ్లేశించినపుడు, అనుభూతి చెందినపుడు కలిగే ఆనందం అంత ఇంత కాదు.
నేటి పరిస్తితి:
సమాజ
శ్రేయస్సు కోసం ఏర్పడిన దీపావళి కనుల పండుగ కాక కళ్ళ పండుగా అయిపోయింది.
గుండెజబ్బులు ఉన్నవాళ్లు హడలెత్తిపోయే స్తితికి, చిన్నపిల్లలు గుక్క ఆపకుండా ఏడ్చే
స్తితికి, మరిన్ని హానికార సూక్ష్మక్రిములు ఉద్బవించే స్తితికి మారిపోయింది. దీపపు
కాంతుల స్థానంలో కొవ్వొత్తులు, కరెంట్ దీపాలు వచ్చినవి. ఇంటి ముందు పిండి, సున్నపు
రాయితో వేసే ముగ్గులు పోయి రంగుల ముగ్గులు వేసే స్థితి వచ్చింది. పూజా మందిరంలో
ఉండవలసిన మానవులు టీవీల ముందు, ఇంటర్నెట్ లో మునిగిపోయే స్థితి వచ్చింది. పండుగా
రోజు శాకాహారం కాక హోటల్లో మాంసహరానికి లోబడిపోయారు. బంధాలు తెగిపోయి టెక్నాలజీకి
బంధిలైపోయారు. ఆఖరుకి దీపావళి పేరు మారి దీవళి అయిపాయింది దేవుడా!
0 Comments